Share News

డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:10 AM

రాష్ట్రంలో ఇటీవల జరిగిన డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆరోపించారు.

డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలు

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు

విజయనగరం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆరోపించారు. గురువారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 17 నుంచి జరగనున్న శాసనమండలి సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చించి సభా సమయం వృథా కాకుండా చూడాలని కోరారు. 2025లో నిర్వహించిన డీఎస్సీపై ఏడాదిన్నర తర్వాత ఆరోపణలు, చర్చలు జరగడంతో డీఎస్సీ ద్వారా చేరిన ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారన్నారు. వారి ఆవేదన తన దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. డీఎస్సీలో తప్పులు జరిగాయన్న విమర్శ సహేతుకం కాదన్నారు. డీఎస్సీ నిర్వహణలో నార్మలైజేషన్‌ అనేది ప్రధాన అంశమన్నారు. రెండు పేపర్లు కలిసి నార్మలైజేషన్‌ చేశారని చెప్పారు. క్రీడా కోటాలో భర్తీ విషయానికి వస్తే.. మూడు శాతం కోటాలో క్రీడా శాఖ మంత్రి, స్పోర్ట్సు అథారిటీకి అప్పగించామని చెప్పారు. క్రీడా కోటాలో క్రీడా నైపుణ్యం ఉన్న వారు రావాలని మంత్రి నారా లోకేష్‌ కోరారన్నారు. క్రీడాకారులకు 430 నుంచి 460 పోస్టులు కేటాయించారని తెలిపారు. పీడీ పోస్టుకు మూడు శాతం కోటాలో డిగ్రీ వుండి, జాతీయ స్థాయి బంగారు పతకాలు రావాల్సి ఉందన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే ఆధారాలతో అప్పీల్‌ చేసుకోవాలన్నారు. రానున్న డీఎస్సీ కోసం నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

Updated Date - Aug 14 , 2026 | 12:10 AM