Share News

YCP scared the farmersరైతులను భయపెట్టిన వైసీపీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:41 PM

YCP scared the farmers ‘గత వైసీపీ ప్రభుత్వం లాండ్‌ టైటిల్‌ యాక్టుతో రైతులను భయపెట్టింది. రీ సర్వే తప్పులు తడకగా చేసింది. రైతుకు చెందిన పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేసుకున్నారు.

YCP scared the farmersరైతులను భయపెట్టిన వైసీపీ
రైతుకు పట్టాదారు పాస్‌ పుస్తకం అందజేస్తున్న మంత్రి అనిత

రైతులను భయపెట్టిన వైసీపీ

పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటోలు

70శాతం తప్పులతడకలతో పంపిణీ

ఇప్పుడు రాజముద్రతో భూమిపై హక్కులు

క్యూఆర్‌ కోడ్‌తో మరింత భద్రత

వేపాడలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత

ఇది రైతు ప్రభుత్వం

రైతుల కష్టాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు రాగానే తాటిపూడి, రైవాడ రిజర్వాయర్‌ల నుంచి నియోజకవర్గానికి సాగునీరు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ విషయాన్ని ఇన్‌చార్జి మంత్రి అనిత సీఎం నారాచంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తారు.

- కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్యే, ఎస్‌.కోట

పక్కాగా రీ సర్వే

భూ వివాదాలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రీసర్వేను పక్కాగా చేయిస్తోంది. గత ప్రభుత్వం జరిపించిన రీసర్వేలో 1.70 లక్షల జాయింట్‌ ఎల్‌పీఎంలు ఉన్నాయి. వీటితో రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని విడదీస్తున్నాం. ఇప్పటివరకు 48వేల జాయింట్‌ ఎల్‌పీఎంలను విడదీసి అసలైన వారికి భూ హక్కులు కల్పించాం.

- ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, కలెక్టర్‌

మేలు చేస్తున్న ప్రభుత్వం

నాకు వారసత్యంగా భూమి వచ్చింది. కానీ నాపేరున హక్కు లేదు. కూటమి ప్రభుత్వం జరిపించిన రీ సర్వేలో నా పేరున భూమిని మార్చారు. తహసీల్దార్‌ జె.రాములమ్మ నాపేరున పట్టాదారు పాసుపుస్తకం వచ్చేలా చేశారు. రైతులకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

- గుమ్మడి శ్రీనివాసరావు, అంధ రైతు, బానాది, వేపాడ మండలం

శృంగవరపుకోట/వేపాడ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వం లాండ్‌ టైటిల్‌ యాక్టుతో రైతులను భయపెట్టింది. రీ సర్వే తప్పులు తడకగా చేసింది. రైతుకు చెందిన పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేసుకున్నారు. సర్వేరాళ్లపైనా జగన్‌ ఫొటో వేశారు. జాయింట్‌ ఎల్‌పీఎంలతో రైతులను ఇబ్బందులు పెట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని సరిచేస్తోంది. తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలు అందించేలా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించి ఇస్తున్నాం. ఈ క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వాకా ఎక్కడ నుంచైనా నెట్‌ సదుపాయం ఉన్న మొబైల్‌, లాప్‌టాప్‌, కంప్యూటర్‌లో భూ వివరాలను చూసుకోవచ్చు. అక్రమ వ్యవహారం జరిగితే రైతు ఫోన్‌కే సమాచారం వచ్చేస్తుంది’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వేపాడ మండలం బల్లంకి గ్రామంలో సోమవారం మీభూమి-మీహక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రీ సర్వే చేసి తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తోందన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే, కూటమి ప్రభుత్వం జరిపిస్తున్న రీ సర్వేకు మధ్య వున్న తేడాను రైతులకు వివరించారు. జగన్‌ బొమ్మ పట్టాదారు పాసుపుస్తకంలో ఎక్కడెక్కడ ఉందో చూపించారు. కూటమి ప్రభుత్వం ముద్రించిన రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌ గురించి అవగాహన కల్పించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా అత్యంత భద్రంగా భూమి హక్కును రైతుకు కల్పించినట్లు తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌ను స్క్యాన్‌ చేయడం ద్వారా ఖాతాల వారీగా భూమి ఎంత వుందో తెలుసుకోవచ్చునన్నారు. అంతే కాకుండా భూమిని ఎవరైన అన్యాక్రాంతం చేసేందుకు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రయత్నిస్తే రైతు మొబైల్‌కు మెసేజ్‌ వస్తుందన్నారు. అక్రమమైతే వెంటనే అడ్డుకోవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకోచ్చిన లాండ్‌ టైటిల్‌ యాక్టుతో రైతు భయపడ్డాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు దీన్ని తొలగించారని గుర్తు చేశారు.

జిల్లాలో 1923 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇంతవరకు 519 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు. బల్లంకి గ్రామంలో 95శాతం తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేసిన గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్‌తో పాటు తహసీల్దార్‌ జె.రాములమ్మను అభినందించారు. పట్టాదారు పాసుపుస్తకాల సమయంలో రైతులు తహసీల్దార్‌ రాములమ్మను పలుమార్లు గుర్తుచేసుకోవడం అనందంగా వుందన్నారు. అధికారులు బాగా పని చేసినప్పుడు ప్రజా ప్రతినిధుల గడప తొక్కే అవకాశం వుండదని చెప్పారు. డీసీఎంస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, జేసీ సేతు మాధవన్‌, ఆర్డీవో సుధాసాగర్‌, దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పోట్నూరు వెంకటరత్నాజీ, వేపాడ, కొత్తవలస మండల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకట్రావు, కోళ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి కోట్యాడ వెంకటరమణమూర్తి, కొత్తవలస పీఎసీఎస్‌ అధ్యక్షుడు మల్లు నాయుడు, ఎంపీటీసీ గొంప తులసీ, గుమ్మడి భారతి, ఎంపీడీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫొటో రైటప్స్‌: 8కోట1,2: వేపాడ మండలం బల్లంకి గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణి చేస్తున్న జిల్లా ఇన్‌చార్జీ మంత్రి వంగలపూడి అనిత

Updated Date - Jun 08 , 2026 | 11:41 PM