Share News

విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ సమావేశాలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:28 AM

కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కాపు సమావేశాలు నిర్వహిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆరోపిం చారు.

విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ సమావేశాలు

  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

విజయనగరం రూరల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కాపు సమావేశాలు నిర్వహిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆరోపిం చారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ కాపు నేతల సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైసీపీ ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలకు తెరతీయడాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. అలాగే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తన కారుడ్రైవర్‌ని చంపి డ్రైవర్‌ ఇంటికి పంపారన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హోంమంత్రి అనిత పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించి, కుట్రలు పన్ని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చూపించాలని జగన్‌ తాపత్రయ పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, కర్రోతు నర్సింగరావు, గంటా రవి, గంటా పోలినాయు డు, పీతల కోదండరామ్‌, పాసి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:28 AM