Share News

వైసీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలి

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:13 AM

ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశం గురించి వైసీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు.

వైసీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలి
మాట్లాడుతున్న నాగార్జున:

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 1 ( ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశం గురించి వైసీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు. బుధవారం విజయనగరంలోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ డీఆర్‌సీ సమావేశంలో లోతైన చర్చ జరిగిందని, టీడీపీ, వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను వివిధ సమస్యలపై వెల్లడించారన్నారు. ఈ సమావేశాలు గత ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా సాగేవని, ఈ అలవాటుతోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతు న్నారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకుడు ముద్దాడ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:13 AM