Share News

ఉనికి కోసమే వైసీపీ అసత్య ప్రచారం

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:08 AM

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయమై తాడేప ల్లి ప్యాలెస్‌ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నార ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నా రు.

ఉనికి కోసమే వైసీపీ అసత్య ప్రచారం

  • ఎంపీ కలిశెట్టి

విజయనగరం రూరల్‌, జనవరి 8(ఆం ధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయమై తాడేప ల్లి ప్యాలెస్‌ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నార ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నా రు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయ మై భూములిచ్చిన రైతులను రెచ్చగొట్టి వెళ్లారని, కేసులు కూడా ఉన్నాయన్నారు. 2014 నుంచి 2019 వరకూ జగన్మోహన్‌ రెడ్డి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రీ శంకుస్థాపన చేశా రు తప్ప, ఎయిర్‌పోర్టుని అభివృద్ధి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా జగన్మోహన్‌ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి ఎయిర్‌పో ర్టుపై మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతున్నద న్నారు. ఉనికి కోసమే జగన్మోహన్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైసీపీ నేతలు అసత్య ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎయిర్‌పో ర్టు నిర్మాణం విషయంలో వైసీపీ నాయకులకు ఏమైనా సందేహాలు ఉంటే, తాము చర్చకు సిద్ధమన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:08 AM