Share News

Writings are guidelines for posterity రచనలు భావితరాలకు మార్గదర్శకాలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:50 PM

Writings are guidelines for posterity చరిత్రను అక్షరబద్ధం చేస్తే తర్వాత తరాలకు అద్దంలా ఉపయోగపడుతుందని, రచనలు భావితరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. స్థానిక ఎస్సార్‌ కన్వెన్షన్‌ హాల్లో లోలుగు సుశీలమ్మ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

Writings are guidelines for posterity రచనలు భావితరాలకు మార్గదర్శకాలు
రాజాం చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్‌ దేవానంద్‌

రచనలు భావితరాలకు మార్గదర్శకాలు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

రాజాం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): చరిత్రను అక్షరబద్ధం చేస్తే తర్వాత తరాలకు అద్దంలా ఉపయోగపడుతుందని, రచనలు భావితరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. స్థానిక ఎస్సార్‌ కన్వెన్షన్‌ హాల్లో లోలుగు సుశీలమ్మ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం రచించిన రాజాం చరిత్ర సంస్కృతి అనే పుస్తకాన్ని తొలుత ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చరిత్ర రచన ఇతర రచనల కంటే చాలా కష్టమైనదని, ఈ విషయంలో రంగనాథం సఫలీకృతుడయ్యాడని అభినందించారు. అలాగే సుశీలమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్‌, బేబీనాయన మాట్లాడుతూ రంగనాథం ఆరేళ్లుగా రాజాం చరిత్రను, బొబ్బిలి రాజులతో ఉన్న బంధాన్ని అధ్యయనం చేసి ఈ పుస్తకానికి జీవం పోశారన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.శారదాంబ, బల్లా విజయకుమార్‌, వావిలపల్లి భార్గవ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, గార రవిప్రసాద్‌, లోలుగు మధన్‌మోహన్‌, వి.జగన్నాథనాయుడు, కొల్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:50 PM