Share News

కలవరపెడుతున్న కిడ్నీ సమస్య

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:30 AM

నాగావళి నదికి ఆనుకుని ఉన్న చిలకాం గ్రామంలో కిడ్నీ సమస్య కలవరపెడుతోంది.

కలవరపెడుతున్న కిడ్నీ సమస్య
చిలకాం గ్రామం

- చికిత్స పొందుతున్న మరో 12 మంది

- తాగునీటిపైనే గ్రామస్థుల అనుమానం

- శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపించిన అధికారులు

గరుగుబిల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నాగావళి నదికి ఆనుకుని ఉన్న చిలకాం గ్రామంలో కిడ్నీ సమస్య కలవరపెడుతోంది. 2019 నుంచి ఇప్పటి వరకు ఏడే ళ్లలో కిడ్నీ వ్యాధితో 11మంది మృతి చెందారు. డయా లసిస్‌ పొందుతూ ఇప్పటికే బి.దోదయ్య, ఆర్‌.సింహా చలం, కె.శివుడయ్య, జి.త్రినాఽథ, జి.పార్వతి, బి.చిన్నమ్మ, డి.తాతబాబు, ఆర్‌.వెంకటి, ఆర్‌.కృష్ణ, కె.పకీరు మృత్యు వాత పడ్డారు. తాజాగా, శనివారం కారు సింహాచలం అనే వ్యక్తి కిడ్నీ మహమ్మారికి బలయ్యాడు. పార్వతీపు రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌కు వెళ్లి ప్రాణాలు విడిచాడు. మరో 12 మంది కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సుమారు 40 కుటుంబాలు ఉన్నాయి. ఈ కాలనీ పరిధిలో గతంలో బోరు ను ఏర్పాటు చేశారు. ప్రధానంగా రెండు వీధుల ప్రజలు ఈ బోరు నీటిని తాగుతున్నారు. నీరు కలుషితం కారణం గానే కిడ్నీ సమస్య నెలకొందని గ్రామస్థులు ఆందోళన చెం దుతున్నారు. అయితే ఈ సమస్యకు తాగునీరా లేదా ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయం తేలాల్సి ఉంది. సంబంధిత వైద్య సిబ్బంది ఒక నిర్ధారణకు రాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఒకవైపు పర్యవేక్షణ, మరోవైపు బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కిడ్నీ సమస్య నెలకొనకుండా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మూడేళ్లుగా చికిత్స

నేను గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధికి చికిత్స పొందు తున్నాను. విశాఖ కేజీహెచ్‌కు నెలకు, రెండు నెలలకు వెళ్లి అవసరమైన మందులు తె చ్చుకుంటున్నాను. అలాగే రా వివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అవసరమైన మందులు సరఫరా చేస్తున్నారు. మందులు వాడుతున్న కారణంగా ఇంటికే పరిమితమయ్యాను.

-రేగిడి బలరాం, చిలకాం గ్రామం

మందులు వాడుతున్నా

నేను 2024 నుంచి మందులు వాడుతు న్నాను. అవసరమైన మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. నా పనులు చేసుకోగలుగుతున్నాను.

-రేగిడి రాము, చిలకాం గ్రామం

ఇంటికే పరిమితమయ్యా

ఏడాది నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. దీంతో ఇంటికే పరిమితమయ్యా. వీఆర్‌ఏగా విధులు నిర్వహించాల్సి ఉన్నా ఆరోగ్య సమస్య కారణంగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో తనిఖీలు చేసి, అవసరమైన మందులు అందిస్తుండడంతో కొంతమేర సమస్యకు దూరంగా ఉన్నాను.

-ఆర్‌.అప్పమ్మ, వీఆర్‌ఏ, చిలకాం గ్రామం

నిర్ధారణ చేసేందుకు ప్రత్యేక చర్యలు

గ్రామంలో వ్యాధి నిర్ధారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. రక్త నమూనాలు సేకరణ, పరిసరాల పరిశీలన, నీటి పరీక్షలు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. ర్యాపిడ్‌ పరీక్షల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాం. ఫలితాలు వచ్చిన తదుపరి నిర్ధారణ చేయాల్సి ఉంది. కేజీహెచ్‌కు చెందిన వైద్య బృందం సమాచారాన్ని సేకరించింది. బాధితులకు మందులు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం సమస్య తీవ్రత లేదు.

-డాక్టర్‌ పి.విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో, పార్వతీపురం

తాగునీరు శాంపిల్స్‌ సేకరించాం

చిలకాం ఎస్సీ కాలనీ పరిధిలో ఉపయోగిస్తున్న తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. ఫ్లోరైడ్‌ సమస్య ఉందా? లేదా? తాగునీరు కలుషితమైందా? అనేదానిపై ఫలితాలు రావాల్సి ఉంది. సురక్షిత నీరు తాగాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

-గౌరీశంకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ, గరుగుబిల్లి

Updated Date - Oct 12 , 2026 | 12:30 AM