విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:12 AM
తనను విధు ల్లోకి తీసుకోవాలంటూ స్థానిక మహిళా సమాఖ్య కార్యాల యం వద్ద ఓ మాజీ సీఎఫ్ ఆందోళన చేపట్టారు.
సంతకవిటి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తనను విధు ల్లోకి తీసుకోవాలంటూ స్థానిక మహిళా సమాఖ్య కార్యాల యం వద్ద ఓ మాజీ సీఎఫ్ ఆందోళన చేపట్టారు. సోమవా రం ఆ కార్యాలయానికి తాళం వేసి, అక్కడే బైఠా యించారు. మండలంలోని హోంజరాం గ్రామానికి చెందిన బోడ లక్ష్మి అనే మహిళ 2003 నుంచి ఇక్కడ సీఎఫ్‌గా విధులు నిర్వహించారు. అయితే తనకు 2022లో 60ఏళ్లు అయినప్పుడు తనను సీసీ, ఏపీఎంలు అన్యా యంగా విధుల నుంచి తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు భర్త, పిల్ల లు లేరని, ఈ ఉద్యోగమే తన జీవనాధరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగం కొనసాగించాలని కోరినా అధికారులు, నాయకులు స్పందించలేదని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు తాళాలు తీ యబోనని అక్కడే కూర్చొని నిరసన కొనసాగించారు. పోలీసులు వచ్చి నచ్చజె ప్పినా అక్కడ నుంచి కదలలేదు. సాయంత్రం వరకూ తాళం తెరవలేదు. దీంతో వెలుగు సిబ్బంది పక్కనేఉన్న స్త్రీశక్తి భవనంలో విధులు నిర్వహించాల్సి వచ్చింది.
నిబంధనల ప్రకారమే తప్పించాం
బోడ ఆదిలక్ష్మికి 60 ఏళ్లు పూర్తయినందు వల్ల ప్రభుత్వ జీవో, నిబంధనల ప్రకారమే విధుల నుంచి తప్పించాం. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరినీ విధుల్లో కొనసాగించే అవకాశం లేదు. కార్యాలయానికి తాళం వేయడం వల్ల వెలుగు సిబ్బంది పనులకు అంతరాయం కలిగింది. ఇందులో వ్యక్తిగతంగా గానీ, రాజకీయంగా గానీ ఎటువంటి జోక్యం లేదు.
- దదికుమార్, వెలుగు ఏపీఎం, సంతకవిటి