NTR’s Vision ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:21 AM
Working Towards the Realization of NTR’s Vision టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సాలూరు మండలం శివరాంపురం, పట్టణంలోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
సాలూరు, జనవరి18(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సాలూరు మండలం శివరాంపురం, పట్టణంలోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలి. గిరిజన గ్రామాల అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. రూ. 2కే కిలో బియ్యం, మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్, తండ్రి ఆస్తిలో హక్కు, పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం , తాగు, సాగునీటి ప్రాజెక్టులు వంటి అనితర సాఽధ్యమైన సంక్షేమ పథకాలతో ఎన్టీఆర్ అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానించాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ’ అని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు, చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పీ భంజ్‌దేవ్, పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు , నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.