‘కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి’
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:14 AM
వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
బెలగాం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావు మాట్లాడుతూ 71 రకాల షెడ్యూల్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసం రూ.26 వేలు వేతనం చెల్లించాలన్నారు. ప్రతి రెండేళ్లకొకసారి వేతనాలు సవరించాలన్నారు. కార్మిక చట్టాలు ప్రకారం, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాడ్యూటీ, వారాంతపు సెలవులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మన్మఽథరావు, బి.వి.రమణ, వై.నాయుడు, జ్యోతిలక్ష్మి, గొర్లె వెంకటరమణ, సూరిబాబు తదితరులున్నారు.