Without Measurements? కొలతలు ఇవ్వకుండా పనులా?
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:18 AM
Work Without Measurements? ముందస్తు కొలతలు ఇవ్వకుండా చెరువు పనులు చేస్తుండడంపై డ్వామా పీడీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఫీల్డ్, టెక్నికల్ అసిసెంట్లను సస్పెండ్ చేశారు. బుధవారం నాగూరు సొంగ చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. అయితే ముందస్తు కొలతలు ఇవ్వకుండా పనులు చేస్తున్నట్లు గుర్తించారు.
ఫీల్డ్ ,టెక్నికల్ అసిస్టెంట్ల సస్పెన్షన్
పార్వతీపురం/గరుగుబిల్లి, జూన్10(ఆంధ్రజ్యోతి): ముందస్తు కొలతలు ఇవ్వకుండా చెరువు పనులు చేస్తుండడంపై డ్వామా పీడీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఫీల్డ్, టెక్నికల్ అసిసెంట్లను సస్పెండ్ చేశారు. బుధవారం నాగూరు సొంగ చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. అయితే ముందస్తు కొలతలు ఇవ్వకుండా పనులు చేస్తున్నట్లు గుర్తించారు. పలుమార్లు ఆదేశించినా గ్రామాల పరిధిలో ట్రెంచ్ పనులు నిర్వహించలేకపోవడంపై మండిపడ్డారు. చెరువుల పరిధిలో నచ్చిన విధంగా పనులు చేయడం తగదన్నారు. నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారన్నారు. చెరువు గట్టుకు ఐదు మీటర్ల దూరంలో పనులు ఎందుకు చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. బంటు పనికి సంబంధించి 10/10 పొడవు, వెడల్పు ప్రాంతంలో 30 మంది వేతనదారులకు మించి ఉండడం, పని ప్రాం తాల్లో అవసరమైన పనిముట్లు లేకపోవడంపై మండిపడ్డారు. మరోవైపు వేతనదారుల నుంచి క్షేత్ర సహాయకుడు బి.దాలినాయుడు, సాంకేతిక సహాయకుడు జి.జగదీశ్వరరావు ప్రతివారం రూ. 100 వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. కాగా నిబంధనలు అతిక్రమించిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉపాధి హామీ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.