Share News

గెలుపే పరమావధిగా పనిచేయండి

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:21 AM

స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే పరమావధిగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

గెలుపే పరమావధిగా పనిచేయండి
మాట్లాడుతున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు, జనవరి21 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే పరమావధిగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. బుధవారం మామిడిపల్లికి సమీపంలోని తోటలో ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం లోని 29 పంచాయతీలోని నాయకులు, కార్యకర్తల కోసం ఆరా తీశారు. అనంతరం ఆయా పంచాయతీల్లో, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి పునాది అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి నాయకులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ సూచించిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, చొక్కాపు త్రినాథ, మరిపి సింహాచలం, కసినబోయిన వెంకటరమణ, అప్పికొండ రమాదేవి, రూప, కళావతి, డొంక అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:21 AM