Share News

గెలుపే లక్ష్యంగా పనిచేయండి: బొత్స

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:00 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూచించారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయండి: బొత్స
మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

తెర్లాం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో వైసీపీ మండల అధ్యక్షుడు తెంటు సత్యం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు బొత్స సందీప్‌, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే శంబంగి చినఅప్పల నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఇటీవల కొంతమంది నాయకులు పార్టీని వీడి టీడీపీలో చేరడం వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏమీ లేదన్నారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉమాలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:01 AM