Victory విజయమే లక్ష్యంగా పనిచేయండి
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:08 AM
Work with Victory as the Goal స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, శ్రేణులంతా ఐక్యతో ముందుకు సాగాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె. అచెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. బుధవారం విశాఖలో అరకు పార్లమెంట్ పరిధిలోని కూటమి నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
విశాఖలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం
పార్వతీపురం/టౌన్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, శ్రేణులంతా ఐక్యతో ముందుకు సాగాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె. అచెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. బుధవారం విశాఖలో అరకు పార్లమెంట్ పరిధిలోని కూటమి నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యచరణపై విస్తృతంగా చర్చించారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలు, అభ్యర్థుల ఎంపికలు, సీట్లు సర్దుబాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరీ, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, పాలకొండ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, పార్వతీపురం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాడ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.