Victory in Elections స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:53 PM
Work With the Goal of Victory in Local Elections స్థానిక ఎన్నికల్లో శతశాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.సత్య అన్నారు. గురువారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన అరకు పార్లమెంట్ కమిటీ సమావేశం నిర్వహిం చారు.
పార్వతీపురం, ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో శతశాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.సత్య అన్నారు. గురువారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన అరకు పార్లమెంట్ కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. ఏకాభిప్రాయంతో కమిటీల నియామకాన్ని చేపట్టాలని తీర్మానించారు. పార్టీ విజయం కోసం గత ఎన్నికల్లో కష్టపడిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుం దన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం నాయకులంతా ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం చూపాలని సూచించారు. చిన్న చిన్న గొడవలను పక్కన పెట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, మాజీ ఎమ్మెల్యే జి.ఈశ్వరి టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.తేజోవతి, ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మణరావు, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి తదితరులు పాల్గొన్నారు.