టీడీపీ బలోపేతానికి పనిచేయండి
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:48 PM
: రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి, టీడీపీ బలోపేతానికి అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.
గుర్ల, నవంబరు 18(ఆంరఽఽధజ్యోతి): రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి, టీడీపీ బలోపేతానికి అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అచ్యుతాపురం పంచాయతీపరిధిలో వైసీపీకి చెందిన 15కుటుంబాలు టీడీపీలో జడ్పీ టీసీ మాజీ సభ్యుడు కిరణ్‌రాజు, టీడీపీ మండలాధ్యక్షుడు చలమల మహేష్ ఆధ్వ ర్యంలో చేరాయి. ఈసందర్భంగా కళావెంకటరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు వారికి టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈమేరకు అచ్యుతాపురం పంచాయతీకి చెందిన ఉప్పాడ నర్సిమ, జీరి పోలిరెడ్డి, కాసి సూర్యనారాయణ, ఉప్పాడ సింహాచలం, దల్లిరమణ, ఉప్పాడరాము, కొయ్య అద్రియ, కాసి రామారావు, వత్తికాల చిన్నరాములు, జీరి అప్పన్న, జీరి పెంటయ్య, దల్లి గౌరినాయుడు, మోహనారవు, జీరు నాగరాజు, ఉప్పాడ సూరి టీడీపీలో చేరారు.
ఫచీపురుపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ, మండల స్థాయి నాయకులు కలిసికట్టుగా పనిచేసి, పంచాయతీలను కైవసం చేసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. బుధవారం రాజాంలో మెరకముడిదాం మండలా నికి చెందిన కొండ లావేరు, గరుగుబిల్లి, శ్యామాయవలస నాయకులతో సమావేశం నిర్వహించారు. కాగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు మరోసారి వివరిం చాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు కోరారు. చీపురుపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన గరివిడి నాయ కులతో సమావేశం నిర్వహించారు.