Cleanliness స్వచ్ఛతే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:35 PM
Work Towards Cleanliness as the Goal స్వచ్ఛతే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరు మున్సిపల్ పార్కులో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులతో కలిసి పార్కులో పిచ్చి మొక్కలను స్వయంగా తొలగించి.. పరిసరాలను శుభ్రం చేశారు.
సాలూరు, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛతే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరు మున్సిపల్ పార్కులో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులతో కలిసి పార్కులో పిచ్చి మొక్కలను స్వయంగా తొలగించి.. పరిసరాలను శుభ్రం చేశారు. ఈ ప్రాంతంలో రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, ఆధునిక పరికరాలతో జిమ్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో ఉపయోగంలో లేని జిమ్ సామగ్రిని పార్క్‌లో ఏర్పాటు చేయాలన్నారు. యువత, వృద్ధులకు అనుకూలంగా సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అనంతరం ఆమె పేడ చెరువుకు వద్దకు వెళ్లి నాచుతో పాటు చెత్తాచెదారం ఏరివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.