టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:14 AM
తెలుగుదేశం పార్టీ బలోపే తానికి కృషి చేయాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.
విజయనగరం రూరల్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బలోపే తానికి కృషి చేయాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. నగరం లోని 44వ డివిజన్ అయ్య న్నపేటకు చెందిన ఏఎంసీ మాజీ డైరక్టర్ నడుపూరు వెంకటరమణ, చుక్క లక్ష్మణరావు, వెంపడాపు తాతమ్మ, చందక భాస్కరరావుతో పాటు 250 మంది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరంతా ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని సూచించారు. టీడీపీ నగర అధ్యక్షుడు గంటా రవి పాల్గొన్నారు.