Share News

Work in Coordination సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:07 AM

Work in Coordination ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఎలక్షన్‌ జనరల్‌ అబ్జర్వర్‌ ఎస్‌.చినరాముడు సూచించారు. శనివారం పాలకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల స్ర్టాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాన్ని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో కలిసి పరిశీలించారు.

Work in Coordination సమన్వయంతో పనిచేయాలి
స్ర్టాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న దృశ్యం

  • స్ర్టాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

పాలకొండ, అక్టోబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఎలక్షన్‌ జనరల్‌ అబ్జర్వర్‌ ఎస్‌.చినరాముడు సూచించారు. శనివారం పాలకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల స్ర్టాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాన్ని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో కలిసి పరిశీలించారు. భద్రతా చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా, తాగునీరు, పారశుధ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. స్ర్టాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

Updated Date - Oct 25 , 2026 | 12:07 AM