Share News

Work in Coordination సమన్వయంతో పనిచేయండి

ABN , Publish Date - May 03 , 2026 | 12:06 AM

Work in Coordination గ్రామాల రూపురేఖలు మార్చేందుకు అధికా రులంతా సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలం పెదపెంకిలో పర్యటించారు.

Work in Coordination సమన్వయంతో పనిచేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

సీతానగరం (బలిజిపేట), మే2(ఆంధ్రజ్యోతి): గ్రామాల రూపురేఖలు మార్చేందుకు అధికా రులంతా సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలం పెదపెంకిలో పర్యటించారు. తొలుత గ్రామ సచివాలయం ప్రాంగణంలో మండల అధికారులతో సమీక్షించారు. గ్రామంలో పారిశుధ్యం, మౌలిక వసతుల పై దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఉద్యాన సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని , కనీసం 20 శాతం మొక్కలు నాటేలా చూడాలని సూచించారు. పాడి పశువులకు 100 శాతం వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను ఈనెల 15 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువల నిర్మాణాలను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ను సూచించారు. అనంతరం రేషన్‌ డిపోను పరిశీలించారు. సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఐటీడీఏ పీవో వైశాలి తదితరులు ఉన్నారు.

Updated Date - May 03 , 2026 | 12:06 AM