Share News

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:47 PM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటై న ప్రభుత్వం 18 నెలల కాలంలో సుపరిపాలన అందించిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

విజయనగరం రూరల్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటై న ప్రభుత్వం 18 నెలల కాలంలో సుపరిపాలన అందించిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాల యంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తల్లికి వందనం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్ల పఽథకం, అన్నదాత సుఖీభవ.. పథకాలను సక్రమంగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొత్త రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో భోగాపురం ఎయి ర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని, ఈ ఎయిర్‌పోర్టు 2026లో అం దుబాటులోకి రానుందని చెప్పారు. ఈనెల 4న తొలి విమానం భోగాపురం నుం చి బయలు దేరనుందని తెలిపారు. ఈమేరకు ఆ రోజు కేంద్ర మంత్రి రామ్మో హన్‌నాయుడు, తాను, ఇతర ప్రజాప్రతినిధులు ఎయిర్‌పోర్టుకి వస్తున్న ట్టు చెప్పారు. ఇది ఉత్తరాంధ్రకి పెద్ద కానుక అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజ లంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా సహ కరించాలని ఆయన కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసా ద్‌, ఆకిరి ప్రసాదరావు, పతివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:47 PM