నగరాభివృద్ధికి కృషి చేయండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:08 AM
నిబం ధనల ప్రకారం అధికారులు వ్యవహరించి నగరాభివృద్ధి కి కృషి చేయాలని నగర మేయర్ వీవీ లక్ష్మి అన్నారు.
విజయనగరం టౌన్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): నిబం ధనల ప్రకారం అధికారులు వ్యవహరించి నగరాభివృద్ధి కి కృషి చేయాలని నగర మేయర్ వీవీ లక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అజెండాలో పొందుపరిచిన 22 అంశాలను సభ్యులు చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ ఎస్‌వీవీ రాజేష్ మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏఏ అంశాలకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.. ఇప్ప టి వరకూ జరిగిన ఖర్చుల వివరాలను అధికారులు తె లియజేయాలని కోరారు. అధికారులు చెప్పేంత వరకూ తాము బయటకు వెళ్లిపోతామని చెప్పి, మేయ ర్‌తో సహా సభ్యులు అంతా బయటకు వెళ్లిపోయారు. ఈ విషయమై అధికారులు సభ్యులు అడిగిన సమాచారం తెలిపేందుకు ముందుకు వచ్చారు. పూర్తి వివరాలు సభ ముందుంచారు. దీంతో సమావేశం మళ్లీ మొద లైంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అధికా రులు నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ నల్లన య్య, స్టాండింగ్ కమిటీ సభ్యులు సుంకరి నారాయణరా వు, అల్లు చాణక్య, జీవీ రంగారావు, రేగాన రూపాదేవి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు పాల్గొన్నారు.