Share News

మా గ్రామంలో పాఠశాల ఏర్పాటుచేయరూ..

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:29 AM

‘కలెక్టర్‌ గారూ.. మా గ్రామంలో ప్రభు త్వ పాఠశాలను ఏర్పాటు చేయరూ..’ అంటూ దారపర్తి పంచాయతీ కురిడి గ్రామ చిన్నారులు, గిరిజన సంఘ నాయకులు చేతులెత్తి వేడుకున్నారు.

మా గ్రామంలో పాఠశాల ఏర్పాటుచేయరూ..

ఎస్‌.కోట రూరల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ‘కలెక్టర్‌ గారూ.. మా గ్రామంలో ప్రభు త్వ పాఠశాలను ఏర్పాటు చేయరూ..’ అంటూ దారపర్తి పంచాయతీ కురిడి గ్రామ చిన్నారులు, గిరిజన సంఘ నాయకులు చేతులెత్తి వేడుకున్నారు. గ్రామంలో ఆదివా రం జరిగిన కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు గౌరీష్‌, అరుణ్‌, సన్యాసిరావు తదిత రులు మాట్లాడుతూ.. వంద కుటుంబాలు ఉన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేకపో వడం వీరి దౌర్భాగ్యం అన్నారు. వీరు చదువుకోవాలంటే సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూనపాడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాల్సి ఉందన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి పాఠశాల ఏర్పాటు చేసేలా చూడాలని వారు కోరారు.

Updated Date - Jun 22 , 2026 | 12:29 AM