ప్రమాదాల బారిన పడుతున్నా పట్టించుకోరా?
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:17 AM
గడిచిన 15 ఏళ్లుగా మరమ్మతులకు గురైన రోడ్డులో ప్రయాణి స్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని మండలం లోని కృష్ణాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారిని బాగుచేయాలని కోరుతూ కృష్ణాపురం వాసుల ఆందోళన
ఎస్.కోట రూరల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గడిచిన 15 ఏళ్లుగా మరమ్మతులకు గురైన రోడ్డులో ప్రయాణి స్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని మండలం లోని కృష్ణాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలో జీవీఎంసీకి తాగునీరు అందించే శుద్ధజల కేంద్రం వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలు గా తమ గ్రామం నుంచి విశాఖ ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని, అయితే ఈ నీటిని కంపెనీలకు అమ్ముకుంటున్న జీవీఎంసీకి తమ గ్రామ సమస్యలు పట్టడం లేదన్నారు. తమ గ్రామ రహదారి పూర్తిగా పాడైపోవడం వల్ల తరచూ ప్రమాదా లు చోటుచేసు కుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇటుకుల బటీలు రోడ్డుపైకి తేవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కొద్దినెలల కిందట ఒక కుటుంబం బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కిందపడిపోయింది.. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి లారీటైరు కింద పడి చనిపోయాడన్నారు. ఇప్పటికైన పాలకులు స్పందించి రోడ్డు వేయాలని.. లేదంటే నిర సన కార్యక్రమం ఉధృతం చేస్తామని తెలిపారు.