Share News

Won’t Let Go! కదలవు.. వదలవు!

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:25 PM

Won’t Move… Won’t Let Go! జియ్యమ్మవలస మండలాన్ని గజరాజులు వీడడం లేదు. నిర్వాసిత ముంపు గ్రామాలైన పాత బిత్రపాడు, పాత బట్లభద్ర మధ్యనే సంచరిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో పాత నిమ్మలపాడు ముంపు ప్రాంతంలో ఉన్న ఏనుగులు ఆదివారం బిత్రపాడు, బట్లభద్ర గ్రామాల మధ్య హల్‌చల్‌ చేశాయి.

 Won’t Let Go! కదలవు.. వదలవు!
బిత్రపాడు - బట్లభద్ర గ్రామాల మధ్య ఉన్న ఏనుగుల గుంపు

జియ్యమ్మవలస, మార్చి 22(ఆంధ్రజ్యోతి)): జియ్యమ్మవలస మండలాన్ని గజరాజులు వీడడం లేదు. నిర్వాసిత ముంపు గ్రామాలైన పాత బిత్రపాడు, పాత బట్లభద్ర మధ్యనే సంచరిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో పాత నిమ్మలపాడు ముంపు ప్రాంతంలో ఉన్న ఏనుగులు ఆదివారం బిత్రపాడు, బట్లభద్ర గ్రామాల మధ్య హల్‌చల్‌ చేశాయి. అక్కడున్న మొక్కజొన్న, అరటి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెదమేరంగి జంక్షన్‌, మాదలింగి ప్రధాన రహదారికి ఆనుకుని ఏనుగులు ఉండడంతో వాహన చోదకులు భయబ్రాంతులకు గురవుతు న్నారు. అటవీశాఖాధికారులు స్పందించి తక్షణమే ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:25 PM