విజయనగరంలో మహిళల ర్యాలీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:07 AM
మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి కోట జంక్షన్ నుంచి మహిళలంతా భారీ ర్యాలీ నిర్వహించారు.
విజయనగరం రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి కోట జంక్షన్ నుంచి మహిళలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ వద్ద ప్రారంభమై. డీసీసీబీ బ్యాంకు, మూడులాంతర్లు మీదుగా గంటస్తంభవ వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన మహిళా విభాగాల నాయకులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. రానున్న కాలంలో చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం మరింత పెరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్వి, టీడీపీ, బీజెపీ మహిళా విభాగం నాయకులు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.