Share News

Women's leadership should come మహిళల నాయకత్వం రావాలి

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:39 PM

Women's leadership should come గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు మహిళలు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Women's leadership should come మహిళల నాయకత్వం రావాలి
రామన్నపేటలో పించన్‌ పంపిణీ చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

మహిళల నాయకత్వం రావాలి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి):

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు మహిళలు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రామన్నపేట గ్రామంలో బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందించిన ఆయన సర్పంచ్‌ రుంకాన అరుణ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండాలని, రాజకీయాల్లో కూడా మంచి విజయవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేల పింఛను రూ.4 వేలకు పెంచిందన్నారు. అలాగే వివిధ కారణాలతో మూడు నెలలు పింఛను అందుకోలేని వారికి ఒకే పర్యాయం అందజేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో నిరుద్యోగసమస్యతో పాటు వలసల నివారణకు కృషి చేస్తున్నామని, జిల్లాకు అధికంగా పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో రూ.41.80లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బారు నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్‌, ఏఎంసీ చైర్మన్‌ పి.వి.గోపాలరాజు, టీడీపీ మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:39 PM