పొదుపు నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన మహిళలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:19 AM
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదు పు చేసే స్థితి నుంచి మరికొంతమందికి ఉపా ధి కలిగించే స్థాయికి ఎదిగారని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ అన్నారు.
సెర్ప్ సీఈవో కరుణ
‘సరస్’ మేళా ప్రారంభం
విజయనగరం టౌన్, అక్టోబరు 23(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదు పు చేసే స్థితి నుంచి మరికొంతమందికి ఉపా ధి కలిగించే స్థాయికి ఎదిగారని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుక్రవారం సరస్(సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టీషియన్స్ సొసైటీ) మేళాని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. సుమారు కోటి మంది మహిళలు స్వయం సహాయక సంఘాలుగా బలీయమైన శక్తిగా రూపొందారన్నారు. కలెక్టర్ రామసుందరరెడ్డి మాట్లాడుతూ మహిళల్లోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇలాంటి సరస్‌లు ఎంతగానో ఉపయోగప డతాయ న్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళల ఆర్థిక పురో గతి ఘణనీయంగా పెరుగుతుందన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. సరస్‌లో 254 స్టాల్స్ ఏర్పా టు చేయడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమంది మహిళలు తయారుచేసిన కళాకృతులను ప్రదర్శించి, వాటిని కొనుగోలు చేసుకు నేందుకు అవకాశం కలగడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా సంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి బబిత, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.