Share News

Urban Governance అతివలకే పుర పీఠం

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:24 PM

Women Take the Helm of Urban Governance పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియలో తొలి అడుగు పడింది. ముందు నుంచీ చెబుతున్నట్టే మహిళలకే కూటమి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. మున్సిపాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో రెండు మున్సిపాల్టీ, ఒక నగర పంచాయతీ అధ్యక్ష స్థానాలను మహిళలకే కేటాయించారు. పార్వతీపురం పురపాలక సంఘం జనరల్‌ మహిళ, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీ పీఠాలను బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ఆశావహుల టెన్షన్‌కు తెరపడింది.

  Urban Governance అతివలకే పుర పీఠం
పార్వతీపురం పురపాలక సంఘం

  • ఖరారైన మున్సిపాలిటీ రిజర్వేషన్లు

  • ‘చైర్‌ పర్సన్‌’ పదవి కోసం పావులు కదుతుపుతున్న ఆశావహులు

  • కుటుంబ సభ్యుల్లో మహిళలను బరిలోకి దించేందుకు సన్నాహాలు

పార్వతీపురం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియలో తొలి అడుగు పడింది. ముందు నుంచీ చెబుతున్నట్టే మహిళలకే కూటమి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. మున్సిపాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో రెండు మున్సిపాల్టీ, ఒక నగర పంచాయతీ అధ్యక్ష స్థానాలను మహిళలకే కేటాయించారు. పార్వతీపురం పురపాలక సంఘం జనరల్‌ మహిళ, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీ పీఠాలను బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ఆశావహుల టెన్షన్‌కు తెరపడింది. వాస్తవంగా రిజర్వేషన్లు ఖరారు కాకముందు అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంతో మంది పోటీకి సిద్ధమయ్యారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెడుతూ.. విస్తృతంగా ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాలో పుర పీఠాలను మహిళకే రిజర్వ్‌ చేయడంతో అనేకమంది ఆలోచనలో పడ్డారు. మరికొందరు మాత్రం చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకోవడం కోసం చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తులు అందించారు. మరోవైపు ఎమ్మెల్యేలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి ..

- ఎవరూ ఊహించని విధంగా జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీని జనరల్‌ మహిళకు కేటాయించారు. దీంతో ఇక్కడ ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయినా పోటీ చేసే అవకాశం ఉండడంతో ఆశావహులు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు పార్వతీపురంలో సుమారు ఆరుగురుకు పైబడి అభ్యర్థులు టీడీపీ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. గతంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా , కౌన్సిలర్‌గా పనిచేసిన వారంతా బరిలో దిగాలని ఆశించారు. అయితే తాజాగా పుర పీఠం మహిళకు రిజర్వ్‌ కావడంతో ఒక్కసారిగా సీన్‌ మారింది. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు లేదా సతీమణులను రంగంలోకి దించాలని వారు యోచి స్తున్నారు. టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరినీ ఖరారు చేసినా.. మున్సిపాల్టీలో టీడీపీ-వైసీపీ మధ్య పోటీ మాత్రం ‘నువ్వా-నేనా’ అనే విధంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని, ప్రజల్లో మంచి పేరున్న వారి వైపే పార్టీ అధిష్ఠానాలు మొగ్గుచూపే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- సాలూరు పురపాలక సంఘం బీసీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఇక్కడున్న ఆశావహులు కూడా చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. సతీ మణులు లేదా కుటుంబ సభ్యుల్లో మహిళలను రంగంలోకి దించేందుకు సమాయత్తమవు తున్నారు. టీడీపీ అధిష్ఠానంతో పాటు మంత్రి సంధ్యారాణి ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసం వైసీపీ నుంచి కూడా సరైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడ పోటీ కూడా గట్టిగానే ఉండనుంది. పాలకొండ నగర పంచాయతీ బీసీ మహిళకు కేటాయించడంతో కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Oct 12 , 2026 | 11:24 PM