Share News

Women సమాజ నిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:24 AM

Women Should Be Partners in Nation Building సమాజ నిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు మహిళలు, పాఠశాలల విద్యార్థినులతో చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Women  సమాజ నిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం/పార్వతీపురం టౌన్‌, మార్చి8(ఆంధ్రజ్యోతి): సమాజ నిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు మహిళలు, పాఠశాలల విద్యార్థినులతో చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ నేటి సమాజంలో పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. వారికి అన్ని విధాలుగా సహయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డిగ్రీ పూర్తి చేసి.. ఉద్యోగం సాధిం చిన తర్వాతే మహిళలు వివాహం చేసుకోవాలి. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలి. ఇంటికే పరిమితం కాకూడదు. సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. విద్యార్థినులు ఏదైనా ఆపదలో ఉంటే 1098 నంబర్‌కు కాల్‌ చేసి పోలీసుల సహాయం పొందొచ్చు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన శక్తి యాప్‌, వన్‌స్టాస్‌ సెంటర్లను వినియోగించుకోవాలి. ఉచిత న్యాయ సహాయం కూడా పొందాలి. ప్రతి మహిళా ఆర్థికాభివృద్ధి చెందితేనే సాధికారిత సాధ్యం. జిల్లా మహిళలు ధైర్యం, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదగాలి.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఏఎస్పీ మనీషారెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 12:25 AM