Share News

‘మహిళలు ముందంజలో ఉండాలి’

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:50 PM

మహిళలు అన్ని రంగాల్లో ముందం జలో ఉండాలని సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌ అన్నారు.

‘మహిళలు ముందంజలో ఉండాలి’
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌

పాలకొండ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో ముందం జలో ఉండాలని సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ బొమ్మాళి భాను అధ్యక్షతర నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉండాలన్నారు. అనంతరం పలువురు మహిళలకు సబ్‌ కలెక్టర్‌ సత్కరించారు. కార్య క్రమంలో టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, ఎంపీడీవో రంగారావు, మండల మహిళా సమాఖ్య అ్యక్షురా లు బెజ్జిపురపు శశికళ, టీడీపీ నాయకురాలు కర్నేన యోగిత, తుమరాడ సర్పంచ్‌ శోభారాణి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:50 PM