Share News

అమర్‌నాథ్‌ వ్యాఖ్యలపై మహిళల నిరసన

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:16 AM

రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి అన్నారు.

అమర్‌నాథ్‌ వ్యాఖ్యలపై మహిళల నిరసన
అమర్‌నాథ్‌ చిత్రపటంపై కోడిగుడ్లతో కొడుతున్న మహిళలు

పార్వతీపురం రూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి అన్నారు. మంగళవారం సాయంత్రం వెంకంపేటలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌ చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టి టీడీపీ మహిళా నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ మహిళపై కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో విమర్శలు హుందాతనంగా ఉండాలే కానీ మహిళల వస్త్రధారణ, వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:16 AM