కీలక పదవుల్లో మహిళామణులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:55 PM
Women in Key Positions జిల్లాలోని కీలక పదవుల్లో మహిళామణులు రాణిస్తున్నారు. మంత్రి నుంచి ఎంపీపీల వరకు బాధ్యతలు చేపట్టి.. పాలనలో తమ మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మంత్రిగా సాలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మిడి సంధ్యారాణి ఉన్నారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కీలక పదవుల్లో రాణిస్తూనే.. వారు ప్రజలకు సేవలందిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
పాలన.. ప్రజా సేవలో కీలకపాత్ర
పార్వతీపురం, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కీలక పదవుల్లో మహిళామణులు రాణిస్తున్నారు. మంత్రి నుంచి ఎంపీపీల వరకు బాధ్యతలు చేపట్టి.. పాలనలో తమ మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మంత్రిగా సాలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మిడి సంధ్యారాణి ఉన్నారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కీలక పదవుల్లో రాణిస్తూనే.. వారు ప్రజలకు సేవలందిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే జిల్లాలోని మూడు పురాల్లోనూ మహిళలే చైర్‌పర్సన్లుగా బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్‌గా బెలగాం కరుణ, వైస్ చైర్మన్‌గా పార్వతి తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. సాలూరు పురపాలక సంఘం చైర్ పర్సన్‌గా విజయకుమారి, పాలకొండ నగర పంచాయతీ చైర్ పర్సన్‌గా పి.విజయనిర్మల, వైస్ చైర్మన్‌గా గుమ్మిడి దమయంతి బాధ్యతలు చేపట్టారు. మన్యంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా ప్రజా పరిషత్ పీఠం కూడా మహిళకే దక్కింది. జడ్పీటీసీ నిమ్మల నీలిమ ఇటీవల జడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేశారు. ఈ పాలకవర్గంలో మహిళా జడ్పీటీసీలు కూడా అత్యధికంగానే ఉన్నారు. జిల్లాలో మొత్తంగా 15 మండలాల్లో పదిచోట్ల మహిళా ఎంపీపీలు ఉన్నారు. బలిజిపేట, భామిని, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, మక్కువ, పాలకొండ , సీతానగరం, సీతంపేట, వీరఘట్టం ఎంపీపీలుగా బి.మహాలక్ష్మి, ఎం.జయమ్మ, బి.పద్మావతి, డి.మంగమ్మ, బి.వెంకటలక్ష్మి, ఎం.రామలక్ష్మి, కె.యోగిత, కె.రాజమ్మ, ఆదిలక్ష్మి, కృష్ణవేణి ఉన్నారు. అదే విధంగా ఎనిమిది మంది మహిళలు వైస్ ఎంపీపీలుగా ఉన్నారు.