బావిలో మహిళ మృతదేహం
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:14 AM
పట్టణంలోని వాసవీనగర్ ప్రాం తంలో గల నేలబావిలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తిం చారు.
రాజాం రూరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వాసవీనగర్ ప్రాం తంలో గల నేలబావిలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తిం చారు. విషయాన్ని పొలీసులకు చేరవేయడంతో రంగంలోకి దిగిన సీఐ నవీన్ కుమార్, సిబ్బంది ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈమె వాసవీ నగర్లో నివాసం ఉంటున్న వివాహిత పొట్నూరు అపర్ణ(35)గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం టంకాల దుగ్గివలస గ్రామానికి చెందిన ఈమె తన సోదరుడితో పాటు కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఆమె మానసిక స్థితి బాగులేకపోవడంతో అటువైపుగా వెళ్లి కాలుజారి మృతి చెంది ఉండవచ్చని పొలీసులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులు కూడా ధ్రువీకరించారు.