బంగారం తాకట్టు పెట్టేందుకు వెళ్లిన మహిళ అదృశ్యం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:18 AM
గుర్ల మండలం జమ్ముపేట గ్రా మానికి చెందిన గట్టు రమణమ్మ(54) అనే మహిళ అదృశ్యమయ్యింది.
విజయనగరం కైం, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): గుర్ల మండలం జమ్ముపేట గ్రా మానికి చెందిన గట్టు రమణమ్మ(54) అనే మహిళ అదృశ్యమయ్యింది. విజయన గరం ఒకటవ పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి అందించిన వివరాల ప్రకారం.. రమ ణమ్మ ఈనెల 1న బంగారం తాకట్టు పెట్టేందుకు విజయనగరం వెళ్లింది. బంగా రం రూ.14వేలకు తాకట్టుపెట్టి, ఇంటికి పయనమయ్యానని గరివిడిలో ఉంటున్న కుమారుడు రవికుమార్‌కు ఫోన్ చేసి చెప్పింది. అయితే అప్పటి నుంచి నేటి వరకూ ఇంటికి చేరకపోవడంతో కుమారుడు రవికుమార్ సోమవారం పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.