Share News

కుటుంబ సభ్యుల చెంతకు మహిళ

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:29 AM

సుమారు రెండేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళను పోలీసులు వెతికిపట్టుకుని తిరిగి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 కుటుంబ సభ్యుల చెంతకు మహిళ

వేపాడ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సుమారు రెండేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళను పోలీసులు వెతికిపట్టుకుని తిరిగి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి రామయ్యమ్మ(70) అనే మహిళ 2025 సంవత్సరం డిసెంబరు 24న ఇంటి నుంచి ఎక్కడకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంతగాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రామయ్యమ్మ కుమారుడు పత్రి ఎర్నాయుడు అప్పట్లో వల్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా రామయ్యమ్మ ఒడిశా రాష్ట్రంలోని రాయపూర్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పట్టుకుని వల్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. గురువారం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ తెలిపారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 13 , 2026 | 12:29 AM