Share News

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:11 AM

కడుపు నొప్పి తాళలేక అధిక మోతాదులో మాత్రలు మింగి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు ఆదివారం తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

గజపతినగరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కడుపు నొప్పి తాళలేక అధిక మోతాదులో మాత్రలు మింగి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలి లా ఉన్నాయి. డోలపాలెం గ్రామానికి చెందిన వాసా దేవి(20) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఈనెల 25న అధిక మోతాదు లో ఐరన్‌ మాత్రలు వేసుకోవడంతో కుటుంబీకులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి వాసా చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:11 AM