చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:32 AM
ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది.
నెల్లిమర్ల, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సువ్వానిపేట గ్రామానికి చెందిన బంధపు లక్ష్మి(51) అనే మహిళ ఈనెల 14న సాయంత్రం కొత్తపేట వైపు నడు చుకుంటూ వెళ్తుండగా.. నెల్లిమర్ల నుంచి ఆలగొండ వెళ్తున్న ద్విచక్రవాహనం సువ్వానిపేట జంక్షన్ వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.