చికిత్సపొందుతూ మహిళ మృతి
ABN , Publish Date - May 17 , 2026 | 11:54 PM
విశాఖప ట్నం-రాయపూర్ జాతీయ రహదారిపై మండలంలోని గింజేరు గ్రామ సమీపంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహి ళ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.
గంట్యాడ, మే 17(ఆంధ్రజ్యోతి): విశాఖప ట్నం-రాయపూర్ జాతీయ రహదారిపై మండలంలోని గింజేరు గ్రామ సమీపంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహి ళ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. దీనిపై ఎస్‌ఐ సా యికృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ గ్రామానికి చెందిన ఎ.సత్యవతి (36) తన భర్త గురునాయుడు తో కలిసి ద్విచక్రవాహనంపై విశాఖపట్నం-రాయపూర్ గ్రీన్‌ఫీల్డు హైవేపై ఎస్.కోటకు వెళ్తుండగా.. గింజేరు గ్రామ సమీపంలో వాహనం అదు పు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు జిల్లా కేంద్రంలోగల ప్రైవేటు ఆసుపత్రికి 108వాహనంలో తరలించా రు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సత్యవతి మృతిచెందింది. అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.