అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:14 AM
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలక పాలెం వికలాంగుల కాలనీలో నివాసముంటున్న పిల్లల కుమారి(27) గురువారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
ఎచ్చెర్ల, జూన్ 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలక పాలెం వికలాంగుల కాలనీలో నివాసముంటున్న పిల్లల కుమారి(27) గురువారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కథనం మేరకు.. విజయనగరానికి చెందిన కుమారి, మల్లేష్‌తో కలిసి మూడు నెలలుగా చిలకపాలెంలోని వికలాంగుల కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. వీరిద్ద రూ సమీప గ్రామాల్లో ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ సామగ్రి ఏరుకొని జీవనం సాగి స్తున్నారు. మద్యం సేవించే అలవాటు ఉన్న వీరిద్దరూ బుధవారం రాత్రి కూడా మద్యం సేవించి నిద్రకు ఉపక్రమించారు. గురువారం ఉదయం మల్లేష్, ఆమెను నిద్ర నుంచి లేపేందుకు ప్రయత్నించినా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.