Share News

అనుమానాస్పదంగా మహిళ మృతి

ABN , Publish Date - May 26 , 2026 | 12:01 AM

మండలంలోని పనుకువలస గ్రామానికి చెందిన గ్రీన్‌ అంబాసిడర్‌ శిర్లి సరస్వతి (50) తన స్వగృహంలో సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందారు.

అనుమానాస్పదంగా మహిళ మృతి

పాలకొండ, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పనుకువలస గ్రామానికి చెందిన గ్రీన్‌ అంబాసిడర్‌ శిర్లి సరస్వతి (50) తన స్వగృహంలో సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆమె మృతి సంగతి తెలుసుకున్న పెద్ద కుమార్తె గౌరీశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డోల వెంకన్న ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన సరస్వతి నివాస గృహంలోనే దుగ్గి గ్రామానికి చెందిన వెంకటరమణ ఉండడంతో ఆయనను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - May 26 , 2026 | 12:01 AM