పాముకాటుకు మహిళ మృతి
ABN , Publish Date - May 26 , 2026 | 11:51 PM
మండలంలోని మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి(62) అనే మహిళ పాముకాటు మృతిచెందింది.
గంట్యాడ, మే 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి(62) అనే మహిళ పాముకాటు మృతిచెందింది. ఏఎస్‌ఐ రమణ మంగళవారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి ఈనెల 20న రాత్రి భోజనం చేసిన అనంతరం తన ఇంటి గడపపై తన మనవరాలితో కలిసి పడుకుంది. రాత్రి ఒంటి గంట సమయంలో లక్ష్మి కాలిపాదంపై ఏదో కరిచి నట్టు అనిపించి కేకలు వేసింది. వెంటనే ఆమె తన భర్తను లేపి.. చూడగా కొంతదూరంలో ఒక పాము కనిపించింది. వెంటనే ఆమెను కుటుంబీలకులు 108 వాహనంపై జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ ఆమె మంగళవారం ఉదయం మృతిచెందింది. అందిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రమణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.