విద్యుదాఘాతంతో మహిళ మృతి
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:16 AM
మండలంలోని వేచలవానిపాలెం గ్రామంలో వేచలపు ఈశ్వరమ్మ(58) అనే మహిళ శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందింది.
లక్కవరపుకోట, జూలై 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని వేచలవానిపాలెం గ్రామంలో వేచలపు ఈశ్వరమ్మ(58) అనే మహిళ శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందింది. ఈ ఘటనపై ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈశ్వరమ్మ తన ఇంటి వద్ద రేకుల షెడ్డుపై బట్టలు ఆరేస్తుండగా.. ఆమెతో పాటు మరో మహిళ కాసులమ్మకు విద్యుత్ షాక్ కొట్టింది. ఇద్దరినీ 108 వాహనంలో ఎస్.కోట ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఈశ్వరమ్మ మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతానికి కాసులమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈశ్వరమ్మ కుమారుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.