Share News

చెరువులో పడి మహిళ మృతి

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:24 AM

మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన రంభ దేముడమ్మ(56) అనే మహిళ మంగళవారం చెరువులో పడి మృతి చెందారు.

చెరువులో పడి మహిళ మృతి

గంట్యాడ, జూలై 28(ఆంరఽధజ్యోతి): మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన రంభ దేముడమ్మ(56) అనే మహిళ మంగళవారం చెరువులో పడి మృతి చెందారు. దీనికి సంబంధించి గంట్యాడ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రంచిన దేముడమ్మ మంగళవారం ఉద యం చూసేసరికి కనిపించకపోవడంతో కుటుంబీకులు ఆమె కోసం గాలించారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఆమె మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. కొంతకాలంగా దేవుడమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని తట్టుకోలేక చెరువులో పడి మృతిచెంది ఉండవచ్చని, ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెంది ఉండవచ్చని కుటుంబీకులు భావిస్తున్నారు. మృతురాలి భర్త అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ విజయకుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 12:24 AM