Share News

రైలు నుంచి జారిపడి మహిళ మృతి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:07 AM

గుమడ నుంచి పార్వతీపురం టౌన్‌ స్టేషన్ల మధ్య రైలుపై నుంచి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జారిపడి మృతి చెందింది.

రైలు నుంచి జారిపడి మహిళ మృతి

కొమరాడ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గుమడ నుంచి పార్వతీపురం టౌన్‌ స్టేషన్ల మధ్య రైలుపై నుంచి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జారిపడి మృతి చెందింది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ రత్నాకర్‌, కుటుంబసభ్యుల కథనం మేరకు.. బుధవారం విశాఖపట్నం నుంచి రాయగడ వైపు సమత ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడకు చెందిన ఎన్‌.భారతి (20) వెళ్తోంది. డోర్‌ వద్ద కూర్చొని ఉన్న సమయంలో ప్రమాదవశాత్తూ గాలికి కిందకు పడిపోయి మృతిచెందింది. భారతికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబం సభ్యులు ట్రైన్‌లో సర్కస్‌లు చేసుకుని జీవిస్తున్నారు. భారతితోపాటు కుటుంబ సభ్యులు రైలులోనే ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:07 AM