Share News

విద్యుత్‌ స్తంభం విరిగిపడి మహిళ మృతి

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:20 AM

విద్యుత్‌ స్తంభం విరిగిపడిన ఘట నలో ఓ మహిళ మృతిచెందింది.

విద్యుత్‌ స్తంభం విరిగిపడి మహిళ మృతి

లక్కవరపుకోట, జనవరి 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ స్తంభం విరిగిపడిన ఘట నలో ఓ మహిళ మృతిచెందింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌.కోట మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన ఆవాలు అప్పలకొండ(57) అనే మహిళ మంగ ళవారం తన ఇంటి వద్ద గల విద్యుత్‌ స్తంభం వద్ద బట్టలు ఉతుకుతోంది. ఆ ఇంటి సమీపంలో ఉన్న చెట్టును కొందరు అదే సమయంలో నరికారు. దీంతో ఆ చెట్టు విద్యుత్‌ వైర్లపై పడింది. ఆ బరువుకు విద్యుత్‌ స్తంభం విరిగింది. ఆ స్తం భం ఒక్కసారిగా అప్పలకొండపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుమా రుడు ఎర్నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:20 AM