Share News

పురుగు మందు తాగి మహిళ మృతి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:57 PM

మండల పరిధిలోని గడిముడిదాం గ్రామానికి చెందిన లావేటి జయమ్మ(45) అనే మహిళ పురుగు మందు తాగి మృతిచెందినట్టు రాజాం టౌన్‌ సీఐ డి.నవీన్‌కుమార్‌ తెలిపారు.

పురుగు మందు తాగి మహిళ మృతి

రాజాం రూరల్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గడిముడిదాం గ్రామానికి చెందిన లావేటి జయమ్మ(45) అనే మహిళ పురుగు మందు తాగి మృతిచెందినట్టు రాజాం టౌన్‌ సీఐ డి.నవీన్‌కుమార్‌ తెలిపారు. ఈ ఘటనపై సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంతకాలంగా మానసిక రోగంతో విశాఖ లో చికిత్స పొందుతున్న జయమ్మ ఇటీవల ఇంటికి చేరారు. తన రోగం తగ్గకపో వడంతో జీవితంపై విరక్తి చెంది.. ఈనెల 14న తన ఇంట్లో వ్యవసాయ అవసరాల కోసం ఉంచిన పురుగు మందు తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు రాజాం ఏరి యా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకు ళంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మృతిచెందారు. మృతురాలి అన్నయ్య లావేటి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:57 PM