Share News

కారు ఢీకొని మహిళ మృతి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:49 PM

మండలంలోని దేశపాత్రునిపాలెం సమీపంలోగల విశాఖపట్టణం-అరకు రోడ్డులో మంగళవారం రాత్రి కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.

కారు ఢీకొని మహిళ మృతి

కొత్తవలస, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేశపాత్రునిపాలెం సమీపంలోగల విశాఖపట్టణం-అరకు రోడ్డులో మంగళవారం రాత్రి కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దేశపాత్రునిపాలెం జంక్షన్‌ సమీపంలో నివాసం ఉంటున్న గోకేడ పద్మ(46) పాలకేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో పాల కేంద్రాన్ని మూసి, ఇంటికి వెళ్లేం దుకు రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో కొత్తవలస నుంచి పెందుర్తి వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టి, ఆపకుండా వెళ్లి పోయింది. గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి స్వగ్రామం లక్కవరపుకోట మండలం మార్లాపల్లి. మృతురాలి భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:49 PM