గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:27 AM
మండలంలోని మదుపాడ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని మహిళ మృతి చెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు.
గజపతినగరం/ కురుపాం రూరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని మదుపాడ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని మహిళ మృతి చెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు. కురుపాం మండలం దండుసుర గ్రామానికి చెందిన ఆరిక ఇరమమ్మ(47) గత 20 రోజుల కిందట మితిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. గజపతినగరం బస్ స్టాండ్ వద్ద ఉన్నట్టు సమాచారంతో కుటుంబ సభ్యులు రావడానికి సిద్ధమ య్యారు. ఇంతలో మదుపాడ జంక్షన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ప్ర మాదంలో ఇరమమ్మ అక్కడిక్కడే మృతిచెందారు. మృతురాలి కుటుంబ సభ్యుడు కడ్రక చాలెంజ్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఇరమమ్మ భర్త రామారావు గతంలోనే మరణించారు. మతిస్థిమితం లేని ఇరమమ్మ నడుచుకుంటూ ఎక్కడికిపడితే అక్కడకు వెళ్లిపోతుందని గ్రామస్థులు తెలిపారు.