Share News

దాడి చేశారని మహిళ ఫిర్యాదు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:17 AM

తనను దుర్భాషలాడి, బెదిరించి, ఇష్టారాజ్యంగా కొట్టారని మున్సిపాలిటీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన వడ్డిపల్లి నిర్మల అనే మహిళ రాజాం పొలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

దాడి చేశారని మహిళ ఫిర్యాదు

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తనను దుర్భాషలాడి, బెదిరించి, ఇష్టారాజ్యంగా కొట్టారని మున్సిపాలిటీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన వడ్డిపల్లి నిర్మల అనే మహిళ రాజాం పొలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఐ ఉమా వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సారధి గ్రామానికి చెందిన నిర్మల, అతని భర్త గణపతి గతంలో రా జాంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.లక్ష అప్పు తీసుకుని అదే గ్రామానికి చెందిన అడపా శ్రీనుకు అప్పుగా ఇచ్చారు. అప్పు తీసుకున్న శ్రీనివాసరావు బ్యాంకుకు నెలనెలా వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే గత ఏడాది నవంబరులో నిర్మల భర్త గణపతి మృతిచెందారు. దీంతో ప్రైవేటు బ్యాంకు సిబ్బంది.. గణపతి తీసుకు న్న రుణాన్ని మాఫీ చేయడమే కాకుండా ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని నిర్మల ఖాతాలో జమ చేశారు. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు నిర్మల.. ఈనెల 8న బ్యాంకుకు వెళ్లగా, ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీను, అతని కుమార్తె రమాదేవి.. వెంటనే బ్యాంకుకు వెళ్లారు. నిర్మల చేతిలో నుంచి ఆ మొత్తాన్ని బలవంతంగా లాకున్నా రు. వారు అక్కడితో ఆగకుండా ఈనెల 9న.. నిర్మల స్వీపర్‌గా పనిచేస్తున్న ప్రభు త్వ బాలికల పాఠశాలకు వెళ్లి, ఆమెను బెదిరించారు. దుర్భాషలాడుతూ ఆమెను కొట్టారు. పాఠశాలలో స్పృహ తప్పి పడిపోయిన నిర్మలను స్థానికులు 108 వాహనంలో రాజాం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు నిర్మల శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 11 , 2026 | 12:17 AM